telugu navyamedia
culture news political Telangana

చంపుతామని ప్రొఫెసర్ నాగేశ్వర్ కు బెదిరింపు కాల్స్!

Prof Nageshwar

ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కు బెదరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గత నెల 25న గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నాగేశ్వర్ కు ఇంటర్నెట్ బేస్డ్ వాయిస్ కాల్స్ వచ్చాయి. అదే రోజున నాగేశ్వర్ హాక్ ఐ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు స్పందించడంలేదని ఆరోపించారు.

ఈ విషయంపై నాగేశ్వర్ మాట్లాడుతూ తనను చంపుతానని గత నెల 25న ఓ ఆగంతుకుడు ఫోన్ చేశాడని తెలిపారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడుతున్నానని దూషించాడని చెప్పారు. ఈ విషయాన్ని డీజీపీ, కమిషన్ దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నించానని చెప్పారు. పోలీసులకు తాను ఫిర్యాదు చేసి 12 రోజులైనాఇంత వరకు ఎలాంటి పురోగతి లేదని అన్నారు. తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు తాను బెదిరిపోనని ప్రజాసమస్యలను లేవనెత్తుతానని చెప్పారు.

Related posts

చంద్రబాబుకు అందరి మాటలు అబద్ధాలుగానే వినిపిస్తాయి: స్పీకర్ తమ్మినేని

vimala p

మార్కెట్ లో బంగారం ధరలు…

vimala p

బ్రేకింగ్ : మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

Vasishta Reddy