telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ : … కార్మికులతో .. కేసీఆర్ భేటీ ..

kcr stand on earlier warning to rtc employees

సమ్మె విరమణ అనంతరం నేడు విధులకు హాజరవుతున్న ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భేటీ కానున్నారు. అందుకు ముహూర్తం డిసెంబరు 1(ఆదివారం) భేటీ కానున్నారు. రాష్ట్రంలో మొత్తం 97 డిపోలుండగా… ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. ఈ క్రమంలో కార్మికులకు తగిన రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

సమావేశానికి పిలిచే ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలని సీఎం సూచించారు. సమావేశంలో అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి కార్మికులు ప్రగతి భవన్‌కు చేరుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది. సమావేశానికి వచ్చే కార్మికులకు మధ్యాహ్నం ప్రగతి భవన్‌లోనే భోజనం ఏర్పాటు చేశారు. భోజనానంతరం వారితో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఈ క్రమంలో… ఆర్టీసీకి సంబంధించిన విషయాలను చర్చించనున్నారు. రవాణా శాఖా మంత్రి అజయ్‌ కుమార్‌తో పాటు ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్‌ఎంలు, డీవీఎంలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

Related posts