telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమలాపాల్ రెండో పెళ్ళి… పిక్స్ వైరల్

Amala-paul

విడాకుల తరువాత సినిమాలతో బిజీ గా మారింది దక్షిణాది బ్యూటీ అమలాపాల్. దర్శకుడు విజయ్, సినీ నటి అమలా పాల్ కొన్నేళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లైన నాలుగేళ్లకే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే కొద్ది కాలంగా డేటింగ్ చేస్తున్న హిందీ గాయకుడు భవిందీర్ సింగ్‌ను అమల తాజాగా వివాహం చేసుకుందనే వార్తలు హల్చల చేస్తున్నాయి. అమల, భవిందర్ తాజాగా పెళ్లి చేసుకున్నారనే టాక్ బయటకు వచ్చింది. వారి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భవిందర్‌తో అమల కొద్ది కాలంగా సహజీవనం చేస్తోందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలపై ఆ ఇద్దరిలో ఎవరూ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా పెళ్లి ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఆ పెళ్లి ఫొటోలు నిజమైనవో, కావో స్పష్టత లేదు.

Related posts