telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

స్మిత్ కెప్టెన్సీ పై క్లారిటీ ఇచ్చిన ఆస్ట్రేలియా సెలెక్టర్ల ఛైర్మన్….

ashes test series smith century

ఆస్ట్రేలియా ఈ నెల 27 నుండు భారత్ తో తలపడనుంది. భారత్ తో ఆసీస్ మొత్తం మూడు టీ 20, మూడు వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. అయితే ఇందులో వైట్ బాల్ సిరీస్ లలో ఆసీస్ జట్టుకు ఆరోన్ ఫించ్ న్యాయకత్వం వహించగా.. టెస్టులో టిమ్ పైన్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. అయితే ఈ సిరీస్ సమయం దగ్గర పడుతున్న కొద్ది స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ కి సంబంధించి పుకార్లు వస్తూనే ఉన్నాయి. అతడిని మళ్ళీ కెప్టెన్ చేయనున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయం పై క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్టర్ల ఛైర్మన్ ట్రెవర్ హోన్స్ స్పందించాడు. ఈ సిరీస్ లో స్మిత్ కేవలం ఆటగాడు మాత్రమే అని పేర్కొన్నాడు. పైన్ ఇంకా కెప్టెన్ గా కొనసాగుతున్నాడు కాబట్టి స్మిత్ కెప్టెన్సీ విషయంలో మేము ఏం ఆలోచించలేదు అన్నాడు. అలాగే వైస్ కెప్టెన్సీకి సంబంధించి చర్చలు జరిపినప్పుడు కూడా స్మిత్ పేరు రాలేదు అని స్పష్టం చేసాడు. అయితే ఈ సిరీస్ లలో ఆసీస్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్‌ను సెలెక్టర్లు ఎంపిక చేసారు. స్మిత్ ఆస్ట్రేలియన్ టెస్ట్ జట్టుకు చాలా ముఖ్యమైన ఆటగాడు మరియు ఫార్మాట్లలో ప్రధానమైనవాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు అతనికి ఇంకా నాయకత్వ పాత్రను ఇవ్వడానికి చూడటం లేదు.

Related posts