telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తల్లీకూతుళ్లుగా నయన్, కీర్తి ?

Nayan

రజనీకాంత్‌ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అన్నాత్తే’’. ఇందులో మీనా, కుష్బూ, కీర్తీ సురేష్‌ , నయనతార ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సినిమాలో కీర్తి సురేష్ మరియు నయనతార పాత్రల గురించి ఒక పుకారు షికారు చేస్తుంది. ఈ చిత్రంలో నయనతారకు కీర్తి సురేష్ కూతురు పాత్రలో కనిపించబోతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే మొదట్లో ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే ప్లాన్‌ చేశారు. అయితే, కరోనా వ్యాప్తి విస్తరిస్తున్న పరిస్థితుల దృష్ట్యా పక్క రాష్ట్రంలో ఎక్కువ శాతం షూటింగ్‌ చేయడం కరెక్ట్‌ కాదని చిత్రం యూనిట్ భావిస్తోంది చాలా రిస్క్‌ తో కూడుకున్నదని, చెన్నైలోనే ఓ భారీ సెట్‌ ను నిర్మిస్తోందట. మిగతా భాగాన్ని అక్కడే పూర్తి చేయాలన్నది ప్లాన్‌ చేస్తున్నారట. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుందట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఫ్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Related posts