telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీ విమానానికి పాక్‌ గ్రీన్ సిగ్నల్

భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్‌ 13, 14 తేదీల్లో కిర్గిజిస్తాన్‌లోని బిష్కెక్‌లో జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్‌సీవో)కు హాజరయ్యేందుకు వెళ్లనున్నారు. మోదీ విమానానికి గగనతల అనుమతులు ఇవ్వాలన్న భారత్‌ విజ్ఞప్తికి పాకిస్తాన్‌ సానుకూలంగా స్పందించింది. తమ దేశం మీదుగా మోదీ విమానం కిర్గిజిస్తాన్‌ వెళ్లేందుకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అంగీకరించినట్లు పాకిస్తాన్‌ ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద స్థావరంపై ఐఏఎఫ్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 26న వైమానికదాడులు చేపట్టడంతో పాక్‌ తన గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని మొత్తం 11 రూట్లకుగానూ రెండు మార్గాల్లోనే రాకపోకల్ని అనుమతిస్తోంది. కాగా, జీ7 సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ చేసిన విజ్ఞప్తికి మోదీ అంగీకరించారు.

Related posts