ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో డబ్బు, మద్యం వరదలై పారుతుంది. ఎన్నికల సంఘం అధికారులు డేగ కళ్ళతో కాపలా కాస్తున్నా కూడా ఈ రెండు వెల్లసిన చోటుకు వెళ్తూనే ఉండటం విశేషం. కేవలం ఈ రెండు పదాలు ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యం, కాన్ని లక్షల మంది ప్రాణ త్యాగం పచ్చనోటు మరియు మందు వెలవెల పోతున్నాయన్నట్లుగా తయారవుతుంది మన ఎన్నికల పరిస్థితి. ఇంకా మొదటి దశ ఎన్నికలు పూర్తి అవలేదు, అప్పుడే 540 కోట్ల ధనాన్ని, వందల కోట్ల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది ఎన్నికల కమిషన్.
29 రాష్ట్రాల భారత దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రాల్లో మొట్టమొదట నిలిచిన అఖ్యాతి ఆంధప్రదేశ్ కే కట్టబెట్టారు మన పాలకులు. ఈ ఎన్నికల్లో పంచడానికి సిద్దం చేసిన అక్రమ డబ్బు, మద్యంలో కూడా ఏపీ ముందంజలో ఉంది. దేశ వ్యాప్తంగా 540 కోట్లు పట్టుబడితే దాదాపు 110 కోట్లు ఒక్క ఆంధప్రదేశ్ రాష్ట్రంలోనే పట్టుబడ్డాయట. అభివృద్ది లో మొదటి స్థానం తీసుకురండి పాలకుల్లారా, ఇలాంటి అవినీతి-అరాచకాల్లో కాదంటూన్నారు ఆంధప్రజలు.
కేసీఆర్ తిట్లపై పవన్ సంచలన వ్యాఖ్యలు!