telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీ అధికారంలోకి వ‌స్తే పోలవ‌రం జిల్లా ఏర్పాటు చేస్తాం..- చంద్రబాబు

*పోలవరం ముంపు ప్రాంతాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న

*టీడీపీ అధికారంలోకి వ‌స్తే పోలవ‌రం జిల్లా ఏర్పాటు చేస్తాం..
*ముంపు ప్రాంతాల‌కు క‌లిపి జిల్లా చేస్తాం..

టీడీపీ  అధికారంలోకి రాగానే పోలవరం ముంపు ప్రాంతాలను ప్రత్యేక జిల్లా చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. 

విలీన మండలాల్లో పర్యటించిన చంద్రబాబు.. ముంపు బాధితులందరినీ ఆదుకుని తీరుతామన్నారు. పోలవరం కాంటూర్ లెవల్ 41.15వరకు వారికే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తానంటే తగదని.. కాంటూర్ లెవల్ 45.75వరకు ఉన్న వారికి నష్ట పరిహారం ఇచ్చి తీరాలని డిమాండ్‌ చేశారు.

వరద బాధితుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్​ కష్టాల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి.. ప్రజలు కష్టాల్లో ఉంటే గాల్లో తిరుగుతాడ‌ని ,వరద బాధితులకు రూ. 2 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. రూ. 2వేలతో ప్రజల కష్టాలు పూర్తిగా తీరుతాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం కట్టలేమని చేతులెత్తేశారని ఎద్దేవాచేశారు.

Chandrababu's visit to flood affected areas today TAZAA News | TAZAA News

బాధితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయిందని చంద్రబాబు తెలిపారు.

అక్క‌డ అమరావతి రైతులు అందించిన నిత్యావసర సరుకులను చంద్రబాబు బాధితులకు పంపిణీ చేశారు. ప్రజలు తిరగపడతారనే భయంతోనే జగన్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని చంద్రబాబు విమర్శించారు

Related posts