telugu navyamedia
news political

పుట్టినరోజు వేడుకల్లో మోదీ ఫొటోకు దండ వేసిన బీజేపీ ఎంపీ!

narendra-modi

ప్రధాని నరేంద్ర మోదీ నిన్న తన 69వ పుట్టిన రోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు మోదీ పుట్టినరోజు వేడుకలను దేశ వ్యాప్తంగా నిర్వహించాయి. అయితే ఓ బీజేపీ ఎంపీ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి తీవ్ర విమర్శలపాలయ్యారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ చంద్రసేన్ జాదౌన్… ఫిరోజాబాద్ లోని సిర్సాగంజ్ పట్టణంలోని ఓ ఆరోగ్య కేంద్రంలో మోదీ జన్మదిన వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా మోదీ చిత్రపటానికి ఆయన పూలమాల వేశారు. దీంతో, అక్కడున్న నేతలంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఎంపీ చేసిన పనికి వారంతా ఆవేదన చెందారు. ఆయన చేసిన పనిని అందరూ వ్యతిరేకించారు. ఆ తర్వాత చంద్రసేన్ చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ఎంపీపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పుట్టినరోజు వేడుకలను ఎలా నిర్వహించాలో ముందు తెలుసుకోవాలని హితవుపలికారు.

Related posts

శాఖల కేటాయింపు మోదీ మార్కు పాలనకు నిదర్శనం: బీజేపీ నేత లక్ష్మణ్‌ 

ashok

చిరంజీవికి … ఉయ్యాలవాడ కుటుంబ ఆహ్వానం..

vimala p

కొత్త పార్టీలకు .. ఈసీ గుర్తులు ఇవే.. !

vimala p