telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అక్రమంగా అడ్డుకున్నారు.. ఇది రిమోట్ పనే.. : జేసీ దివాకర్‌రెడ్డి

jc divakarreddy again fire on ycp

ప్రభుత్వం దుర్మార్గపు పనులు చేస్తోందని, కేంద్రం జోక్యం చేసుకుని వైసీపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని మరోసారి జేసీ దివాకర్‌రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. 6గంటల అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి జేసీ బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడారు. కోర్టు బెయిల్‌తో పీఎస్‌కు వెళితే పోలీసులు ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా అక్రమంగా స్టేషన్‌లో నిర్బంధించారని వాపోయారు. నాకు బీపీ, షుగర్ ఉందని చెప్పినా పోలీసులు వదల్లేదు. భోజనం తినలేదు, మందులు వేసుకోలేదని చెప్పినా వినలేదు. వైసీపీలో చేరాలని పోలీసులు పరోక్షంగా చెప్పారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేశారు. స్థానిక ఎన్నికలు ఉన్నందున కేడర్‌ను బెదిరించేందుకే ఇలాంటి పనులు. పోలీసు అధికారులపై రిమోట్ శక్తి బాగా పని చేస్తోందని వ్యాఖ్యానించారు.

మేం అధికారంలోకి వస్తే పోలీసులపై జులుం చేస్తామని అనలేదని జేసీ అన్నారు. పోలీసులను అవమానిస్తూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పీఎస్‌కు స్వచ్ఛందంగా వెళ్లా. .నన్నెవరూ అరెస్ట్ చేయలేదు. నేనేమి దేశద్రోహిని కాదు.. బెయిల్‌ పత్రాలు పరిశీలించి అరగంటలో పంపేయొచ్చు. కానీ పోలీసులు దుర్మార్గపు ఆలోచనతో నన్ను రోజంతా నిర్బంధించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. వైఎస్‌ హయాంలోనూ ఇలాంటి దుర్మార్గాలు చేయలేదు. ప్రతి యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జేసీపై కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదుతో ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.

Related posts