telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

వైరల్ అవుతున్న క్రికెటర్ ఫోటోషూట్.. ఎందుకంటే..?

పెళ్ళికి ముందు కాబోయే భార్యాభర్తలు ఇద్దరు తమకు నచ్చిన ప్రదేశాల్లో రకరకాల కాస్ట్యూమ్స్ లో వెడ్డింగ్ ఫోటోషూట్ లో ఫోటోలు దిగ్గుతారు. అలానే ఓ మహిళా క్రికెటర్ కూడా చేసింది. కానీ ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్న. బంగ్లాదేశ్ జాతీయ మహిళా జట్టు క్రికెటర్ ”సంజిదా ఇస్లాం” తన పెళ్ళికి ముందు ఫోటోషూట్ చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన మిమ్ మొసాద్ ‌డీక్‌ను వివాహం చేసుకుంటున్న ఈ 24 ఏళ్ల మహిళా క్రికెటర్… మొత్తం పెళ్లి దుస్తులు, నగలు ధరించి గ్రౌండ్ లో క్రికెట్ బ్యాట్‌ పట్టుకొని ఫోటోషూట్ లో పాల్గొంది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఈ కవర్ డ్రైవ్ మరియు పుల్ షాట్ ఫోటోలను ఐసీసీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయ్యేతే సంజిదా ఇస్లాం తన 8 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో 16 వన్డేలు, 54 టీ20 లో బంగ్లాకు  ప్రాతినిధ్యం వహించి వన్డేల్లో 174 పరుగులు, టీ 20 లో 520 పరుగులు సాధించింది. ఇస్లాం 2012 లో డబ్లిన్‌లో ఐర్లాండ్‌తో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసింది మరియు చివరిసారిగా బంగ్లాదేశ్ తరఫున మెల్బోర్న్‌లో శ్రీలంకతో జరిగిన టీ 20 ప్రపంచ కప్‌లో ఆడింది. ఇందులో ఇస్లాం బంగ్లాదేశ్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడి 13 పరుగులతో అత్యధిక స్కోరుతో కేవలం 26 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Related posts