telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

పాక్ లో హిందూ యువతి మృతిపై అనుమానాలు .. కరాచీ వీధుల్లో నిరసన జ్వాలలు

Surgical Strike 2Pakistan Indian air space

పాకిస్తాన్ లో ఇటీవల నమ్రతా అనే హిందూ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లర్కానాలోని బబీ అసిఫా డెంటల్‌ కాలేజీలోని తన హాస్టల్‌ గదిలో నమ్రితా అనుమానాస్పద స్ధితిలో విగతజీవిగా పడిఉన్నారు. తొలుత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానించినా పోలీసులు భిన్న కోణాల్లో విచారణ చేపట్టారు. ఆమె మృతి పట్ల పాక్ లో నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కరాచీ వీధుల్లో పాకిస్తానీలు ఆందోళన చేపట్టారు.

మరోవైపు విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె బలవన్మరణానికి పాల్పడలేదని, ఆమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. తన సోదరి ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురైందని బాధితురాలి సోదరుడు డాక్టర్‌ విశాల్‌ సుందర్‌ పేర్కొన్నారు. లోపలి నుంచి తాళం వేసిన తన గదిలో మంచంపై పడిఉన్న నమిత్రా చందాని మెడకు తాడు బిగించి ఉంది. ఆమె గదికి తాళం వేసి ఉండటంతో సహ విద్యార్ధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related posts