కోల్ కతా విమానాశ్రయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోదీ భార్య జశోదాబెన్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురూ మంచిచెడ్డలు మాట్లాడుకున్నారు. అనంతరం జశోదాబెన్ కు మమత ఒక చీరను బహూకరించారు.
జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్ బాద్ కు రెండు రోజు పర్యటనకు గారు ఆమె వచ్చారు. తన పర్యటనను ముగించుకుని గుజరాత్ వెళ్లేందుకు కోల్ కతా విమానాశ్రయానికి ఆమె వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను మమత మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 16వ తేదీన పశ్చిమబెంగాల్ పశ్చిమ వర్దమాన్ జిల్లా ఆసన్ సోల్ లో ఉన్న కళ్యాణేశ్వరి ఆలయాన్ని కూడా ఆమె దర్శించుకున్నారు. ప్రధాని మోదీతో మమతా బెనర్జీ ఈజు భేటీ కానున్న విషయం తెలిసిందే.