telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మిమ్మల్ని కూడా అలా చేయమని చెప్పలేదు… అవి కల్పిత పాత్రలు మాత్రమే… : కియారా

Kiara-Advani

తెలుగు సంచలన చిత్రం ‘అర్జున్ రెడ్డి’ హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ అయింది. తెలుగులో ఎన్నో సంచలనాలు సృష్టించినట్లుగానే హిందీలో కూడా అనేక సంచలనాలకు కేంద్ర బిందువైంది. ముఖ్యంగా సినిమాకు ఓ వైపు భారీ కలెక్షన్లు, మరోవైపు పెద్ద ఎత్తున విమర్శలతో కొద్ది రోజుల పాటు అందరి నోటా ‘కబీర్ సింగ్’ అనే మాటే వినిపించింది. ముఖ్యంగా హీరో మత్తు పదార్థాలను విపరీతంగా తీసుకోవడం, ఆడవారితో వ్యవహరించే తీరుపై అనేకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా బలహీనంగా ఉందని, ఆమెతో హీరో మొండిగా, మూర్ఖుడిగా వ్యవహరిస్తాడని విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై ఆ సినిమా హీరోయిన్ కియరా అద్వాణీ స్పందించారు. ప్రీతి, కబీర్ సింగ్(సినిమాలోని ప్రధాన పాత్రల పేర్లు)ల్లాలే ఉండమని ఎవరినీ అడగడం లేదని చెప్పుకొచ్చారు. ‘‘నేను ప్రీతికి భిన్నమైన వ్యక్తిని. నా ఇష్టాలు, వ్యక్తిత్వం, జీవన శైలి.. ప్రీతి అనే పాత్రకి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ప్రీతి, కబీర్ అనేవి సినిమాలోని కల్పిత పాత్రలు. వారిలా ఉండమని ఎవరూ ఎవరికీ చెప్పడం లేదు. ప్రేమ ఎవరి విషయంలోనైనా ప్రేమనే’’ అని కియరా సమాధానమిచ్చారు.

Related posts