telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాహో కోసం .. థియేటర్ల వేట.. భారీగానే విడుదల ..

Sahoo

ప్రభాస్ నటించిన భారీ చిత్రం ‘సాహో’ ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక తమ సినిమా విడుదల సమయానికి అవకాశం ఉన్నంతవరకు అన్ని చోట్ల వీలైనన్ని ఎక్కువ థియేటర్లు బుక్ చేస్తున్నారట యువి క్రియేషన్స్ నిర్మాతలు. వాస్తవానికి అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా, తెలుగు సహా పలు ఇతర భాషల్లో విడుదలవుతున్నప్పటికీ, తమ సినిమా మొత్తం బడ్జెట్ ని వీలైనంత త్వరగా రాబట్టి తమ బయ్యర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు అందేలా యోచిస్తున్నారట నిర్మాతలు.

భారీ స్థాయిలో విడుదలవుతున్న సాహోకు ఏ మాత్రం కొంచెం హిట్ టాక్ వస్తే చాలు చాలావరకు బాహుబలి రెండుభాగాల రికార్డులు గల్లంతవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక అదే సూపర్ డూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం, దాదాపుగా చాలా ప్రాంతాల్లో ఉన్న బాహుబలి 2 రికార్డులు కూడా సులువుగా బద్దలవుతాయట. ఇక ప్రభాస్ కూడా ఇకపై తాను చేయబోయేవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే అంటూ ఇటీవల ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పడం చూస్తుంటే, ఒకవేళ సాహోతో మిస్ అయినప్పటికీ తదుపరి వేరొక సినిమాతో బాహుబలి రెండు భాగాల రికార్డులు అయన సినిమాలు బద్దలుకొట్టడం మాత్రం ఖాయంగానే కనపడుతోంది.

Related posts