telugu navyamedia
సినిమా వార్తలు

అనిల్ రావిపూడి అరెస్ట్… కడుపుబ్బా నవ్వించినందుకే…!?

Varun-Tej-and-Anil-Ravipudi

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “ఎఫ్-2” ఈ నెల 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తోంది. పూర్తి హాస్యభరితంగా నిర్మితమైన ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డు సృష్టిస్తోంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మింతమైన ఈ చిత్రం రెండు వారాల్లో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇప్పటికి ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతుండడం విశేషం.

తాజాగా వరుణ్ తేజ్ ఓ సరదా ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. “థియేటర్లలో కడుపుబ్బా నవ్వించినందుకు అరెస్ట్ చేస్తున్నా…” అంటూ అనిల్ రావిపూడి చేతికి బేడీలు వేస్తున్న ఓ ఫోటోను ట్వీట్ చేశాడు వరుణ్ తేజ్. అలాగే “నకిలీ పోలీసును కలవండి” అంటూ మరో ఫోటోను కూడా ట్వీట్ చేశారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫంనీగా కామెంట్లు చేస్తున్నారు. గతేడాది వరుస పరాజయాలను ఎదుర్కొన్న నిర్మాత దిల్ రాజుకు ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Related posts