telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామ్ చరణ్ డైట్ ఇదే… రహస్యం బయటపెట్టిన ఉపాసన

Ram-charan-with-Upasana

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫిట్ నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడనే టాక్ ఉంది. చరణ్ డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని, క్రమం తప్పకుండా వర్క్ ఔట్స్ చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా చరణ్ సతీమణి ఉపాసన ఆయన తీసుకునే డైట్ వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రాకేష్ ఉదియారా ఈ డైట్ ను సూచించారని, ఈ డైట్ ను అందరూ ఫాలో అయ్యి, ఫిట్ గా ఉండాలని కోరుకున్నారు.

డైట్ వివరాలు :
దూరంగా ఉంచాల్సినవి: కాఫీ, డైరీ ప్రాడక్ట్స్, రెడ్ మీట్, గోధుమలు, తీపి పళ్లు, ఆల్కహాల్.
తీసుకోవాల్సిన ప్రొటీన్ ఫుడ్: బేక్డ్, బాయిల్డ్ చికెన్, లెంటిల్స్, తోఫు, చేప.
కార్బొహైడ్రేట్ ఫుడ్ ఛాయిస్: క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్ మీల్, స్వీట్ పొటాటోస్.
వెజిటబుల్ ఛాయిస్: స్టీమ్ చేసిన లేదా దోరగా వేయించిన బీన్స్, ఆస్పరాగస్, బ్రాకోలీ. అన్నింటిలోకి వెల్లుల్లిని చేర్చుకుంటే ఇంకా మంచిది.

ఈ డైట్ ను 21 రోజుల నుంచి 45 రోజుల వరకు ఫాలో అవ్వాలని, ప్రతిరోజు 12 గంటల పాటు ఉపవాసం (ఆహారం, ఇతర ద్రవ పానీయాలు తీసుకోవద్దు) ఉండాలని, మిగిలిన 12 గంటల సమయంలో మెనూలో సూచించిన ఆహారాన్ని తీసుకోవాలని, మిగిలిన 12 గంటల సమయంలో నీటిని మాత్రమే తీసుకోవాలి. ఈ 12 గంటల సమయంలో మన శరీరంలోని విష పదార్థాలు వెలుపలికి వెళ్తాయి. కాబట్టి వీలైనంత ఎక్కువ నీటిని తాగవచ్చు…. ఆల్కనైజ్డ్ వాటర్ అయితే ఇంకా మంచింది. ఈ సమయంలో ఎక్కువసార్లు బాత్ రూమ్ కు వెళ్లడం ఇబ్బందిగా అనిపించవచ్చు. అయినప్పటికీ మన శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్తున్నాయనే విషయాన్ని గ్రహించండి. దీనివల్ల భయపడాల్సిన పనిలేదు అంటూ ఉపాసన చరణ్ పాటించే డైట్ వివరాలను అభిమానులకు చెప్పేశారు.

Related posts