telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అల వైకుంఠపురంలో” విడుదల తేదీ మారిందా ?

frist song from alavaikuntapuramlo movie

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో కొత్త ప్రచారం వెలుగులోకి వచ్చింది. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తేదీ విషయంలో మార్పులు జరుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనుకున్న సమయం కంటే రెండు రోజులు ముందే ఈ చిత్రం విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. జనవరి 10నే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రం విడుదల తేదీ మార్పుపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక స్పందన రాలేదు. త్వరలో వస్తుందేమో చూడాలి.

Related posts