telugu navyamedia
సినిమా వార్తలు

మీ అభిమానికి నా జోహార్లు..!

విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాష్ రాజ్ ఎప్పుడైతే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని ప్రకటించారో అప్పటినుంచి వాతావరణం వేడెక్కింది ఎవరేమన్నా సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు ప్రకాష్ రాజ్.

ఇక‌పోతే ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో నటుడు ప్రకాశ్‌ రాజ్‌ విజయం సాధించాలని కోరుతూ ఆయన అభిమాని పాదయాత్ర చేపట్టాడు. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు 485 కి.మీటర్ల పాదయాత్ర చేపట్టిన అభిమాని రంజీత్‌ సాహసానికి ప్రకాశ్‌ రాజ్‌ చలించిపోయారు. నిస్వార్థంతో కూడిన మీలాంటి వారి అభిమానం క‌ళాకారుడుగా న‌న్ను ముందుకు న‌డిపిస్తుంద‌ని, మీ ప్ర‌య‌త్నం నా మ‌న‌సుకు బాధ క‌లిగిస్తుంద‌ని, నా మాట‌గా మీరు తిరిగి ఇంటికి తన అభిమానికి ప్రకాశ్ రాజ్‌ సూచించారు.

త్వ‌ర‌లో మిమ్మ‌ల్ని వ్య‌క్తిగ‌తంటా క‌లుస్తాన‌ని ప్రకాశ్ రాజ్‌ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. కాగా కొద్దికాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు రంజిత్. ఇతను వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్‌కు వీరాభిమాని. తన అభిమానిని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Related posts