telugu navyamedia
సినిమా వార్తలు

ఈ హీరోతోనే షారుక్ కూతురు డేటింగ్ …!

Suhana Khan dating crush
బాలీవుడ్ లో ఇప్పటికే నవతరం హీరోహీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు. ఇక స్టార్ హీరోల పిల్లలు కూడా నెక్స్ట్ జెనరేషన్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గారాలపట్టి సుహానా ఖాన్ ముందు వరుసలో ఉన్నారు. కింగ్ ఖాన్ షారుక్ తన కూతురిని బాలీవుడ్ వెండితెరకు పరిచయం చేయడానికి భారీ స్థాయిలో సన్నాహాలు చేసుకుంటున్నారు.
అంతేకాదు సుహానా కూడా హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఇప్పటి నుంచే అభిమానులను సంపాదించుకుంటోంది. తాజాగా సుహానా ఇన్స్టాలో “ఆస్క్ ఎనీథింగ్” సెషన్ ను నిర్వహించింది. ఈ సెషన్ లో ఆమె అభిమానులు సుహానా గురించి తమకున్న సందేహాలను అడిగారు. ఈ క్రమంలో ఏ నెటిజన్ మీరు ఏ హీరోతో డేటింగ్ చేయాలనుకుంటున్నారు ? అని అడిగారు. దీనికి స్పందించిన సుహానా “సౌత్ కొరియన్ పాప్ సింగర్ కిమ్ జున్ మయెన్” ఫోటోను షేర్ చేస్తూ అతనితోనే డేట్ చేయాలనుకుంటున్నానని తెలిపింది. కిమ్ జున్ ను సుహో అని కూడా పిలుచుకుంటారు అభిమానులు. సుహో సింగర్ మాత్రమే కాదు నటుడు, రచయిత కూడా కావడం విశేషం.

Related posts