telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జాన్వీ కపూర్ కొత్త సినిమా షూటింగ్ మళ్లీ షురూ

‘థడక్’ మూవీతో కథానాయికగా జనం ముందుకొచ్చిన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గత యేడాది ‘గుంజన్ సక్సెనా: ది కార్గిల్ గర్ల్’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రకు జాన్వీ ప్రాణం పోసిందని విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. ఇక ఇప్పటికే ‘రూహీ అఫ్జానా’తో పాటు ‘దోస్తానా 2’లో నటిస్తున్న జాన్వీ కపూర్ మరో సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న ‘గుడ్ లక్ జెర్రీ’ మూవీలో జాన్వీ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సోమవారం పంజాబ్ లో మొదలైంది. ఇందులో జాన్వీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో దీపక్ డోబ్రియల్, మీత వశిష్ట, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ మార్చి వరకూ జరుగబోతోంది.

Related posts