telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్లి పేరుతో తల్లిదండ్రులకు దూరం కావడం ఇష్టం లేదు : సాయి పల్లవి

Sai-pallavi

సహజనటిగా సాయి పల్లవికి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి క్రేజ్ వుంది. తన పాత్ర, కథ నచ్చకపోతే ఎంత పారితోషికం ఇస్తామన్నా కూడా ఆమె అంగీకరించదు. అంతేకాదు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది సాయి పల్లవి. ఇక ఈ బ్యూటీ త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే సినిమాలను ఎక్కువగా ఒప్పుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయాన్ని గురించి సాయిపల్లవి స్పందించింది. “త్వరలో నేను పెళ్లి చేసుకోనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా కూడా కెరియర్ పైనే వుంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే పెళ్లి పేరుతో తల్లిదండ్రులకు దూరం కావడం నాకు ఇష్టం ఉండదు. మా అమ్మానాన్నలు ఎక్కడ వుంటే అక్కడ .. వాళ్లతో పాటే ఉండిపోవాలని భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

Related posts