telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రేపు సాయంత్రం ఎస్పీ బాలు అంత్యక్రియలు

SPB

గాన గంధర్వుడు ఎస్పీ బాలు “శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ఇక లేరనే వార్తతో దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. బాలు మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు బాలు. 50 రోజులుగా హాస్పిటల్‌లో పోరాడుతూ కరోనాను జయించిన ఆయన ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో.. శుక్రవారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం 1.04 గంటలకు తుది శ్వాస విడిచారు. అయితే రేపు సాయంత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. చెన్నై తిరువళ్లూరు జిల్లాలో రేపు బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. రెడ్‌హిల్స్‌ సమీపంలోని తామరైపాకంలో బాలు పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎంజీఎం నుంచి కోడంబాకంలోని ఎస్పీ చరణ్‌ ఇంటికి బాలు పార్థివదేహాన్ని తరలిస్తున్నారు. అభిమానుల సందర్శనార్థం కోడంబాకంలో బాలు పార్థివదేహాన్ని ఉంచుతారు.. అనంతరం రేపు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Related posts