telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పూరీ దర్శకత్వంలో “ఇస్మార్ట్ శంకర్”గా రామ్

Ram-Pothineni

రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ నిర్మాతగా, ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టైటిల్ ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. “ఇస్మార్ట్ శంకర్” అనే టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేశారు. హీరో రామ్ ఈ ఫస్ట్ లుక్ లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, గడ్డంతో సిగరెట్ కలుస్తూ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిక కోసం ఇంకా అన్వేషణ సాగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

Related posts