telugu navyamedia
ఆరోగ్యం

వేపతో స‌మ‌స్య‌లకు చెక్‌..!

వేప ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఔషధ గుణాలున్న  శక్తివంతమైన చెట్టుగా పేరుగాంచింది. వేప ఆకులతో బోలెడన్ని లాభాలు ఉన్నాయి. కానీ చాలా మందికి ఆ విషయం తెలియక పెరట్లోనే ఉన్న వేప చెట్టు ఆకులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోరు. అయితే, వేప ఆకుల మిశ్రమంతోనూ ఆరోగ్యానికి, శరీర సౌష్టవానికి మేలు చేసే గుణాలు ఉన్నాయని తెలిస్తే మీరు కూడా ఇకపై వేపాకులను వృధాగా పోనివ్వరు. మ‌న‌దేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు.

Neem Leaves: వేపాకులు చేసే మ్యాజిక్ తెలుసా? సమస్య ఏదైనా పరిష్కారం ఇదే..

అంతేకాదు వేపపువ్వు హిందువులు ఉగాది పచ్చడిలో చేదు రుచికోసం వాడతారు. వేపకొమ్మను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. వేప నూనెను సబ్బులు, షాంపూ, క్రీమ్ లు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా గజ్జి, మొటిమలకు పైపూతగా ఇది బాగా పనిచేస్తుంది. అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు.

Beauty Benefits of Neem: How to Use Neem for Healthy and Dandruff-Free Hair | India.com

రెండు కప్పుల నీటిలో నాలుగైదు వేపా కులు వేసి బాగా మరిగించి ముఖానికి ఆవిరి పట్టి గోరువెచ్చని నీటిలో ముఖం కడుక్కొంటే ముఖం జిడ్డుతనం పోయి కాంతివంతంగా త‌యార‌వుతుంది. మొటి మలు, మచ్చలు తగ్గుతాయి. వేపాకులు రోజూ కొన్ని తింటే రక్తం శుద్ధి జరిగి దురదలు తగ్గుతాయి.

Neem Soap (Pack of 4) – Gandhigram Khadi

వేపాకుతో ఉప‌యోగాలు :-
* షుగర్ వ్యాధితో బాధపడే వారి పాలిట వేప‌ ఒక సంజీవని అని చెప్పవచ్చు వేపాకు రక్తంలో షుగర్ స్థాయిని పెరగకుండా చేసి షుగర్ వ్యాధిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
* కొన్ని వేప ఆకులను నీటిలో ఉడకబెట్టి, ఆ నీటిని పూర్తిగా చల్లబరచండి. ఆ తర్వాత ఆ చల్లటి నీళ్లతో కళ్ళు శుభ్రంగా కడుక్కుంటే.. సాధారణ కంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.
* వేపలోని నింబోలైడ్ అనే ఫైటోకెమికల్‌కు కేన్సర్‌ను నయం చేసే గుణం ఉన్నట్టు పరిశోధనలో తేలింది.
* వేపను ఏదో ఒక రకంగా తీసుకోవడం వల్ల శరీరంలోని కాలేయాన్ని, కిడ్నీల పనితీరు మెరుగయ్యేలా వేప ఉపకరిస్తుంది. జీర్ణ క్రియను పెంపొందిస్తుంది.
* వేపను తరచుగా తీసుకోవడం వల్ల కడుపులో మంట, గ్యాస్ట్రిక్ సంబంధ సమస్యలు తగ్గుతాయి. అల్సర్లు, మలబద్దకం, ఇన్ఫెక్షన్లు తగ్గించి ఆహార నాళ సంబంధ సమస్యలు రాకుండా చేయడంలో వేప ఉపకరిస్తుంది.
* లేత వేప బెరడు, ఆకుల తో నూరి గాయాలు పై పూత గ వాడుకోవచ్చు.
* వేప బెరడు పొడిని రెండు చెంచాలు ఉదయం, రాత్రి గోరు వెచ్చని నీటితో సేవిస్తే మలేరియా తగ్గుతుంది.
* చర్మంపై పొంగు వ్యాధి వల్ల ఏర్పడే మచ్చలను, వేప చిగుళ్లను నూరి మర్దనా చేసి మచ్చలు పోతాయి !
* వేప నూనె శరీరానికి రాయడం వల్ల చర్మ సంబంధ వ్యాధిని నివారణ అవుతాయి

Related posts