telugu navyamedia
ఆరోగ్యం

మొక్కజొన్నతో కీళ్ళనొప్పులు దూరం

Corn

మనకు తెలిసిన ధాన్యాల్లో మొక్కజొన్న కూడా ఒకటి. మొక్కజొన్న పొత్తులను సాధారణంగా నిప్పులపై కాల్చి వేడివేడిగా తింటుంటారు. మొక్కజొన్నను మనం స్నాక్స్ గా మాత్రమే కాకుండా వంటల్లో కూడా ఉపయోగిస్తారు. మొక్కజొన్న రుచిగా ఉండటమే కాక దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొక్క‌జొన్నలో ఫ్లేవ‌నాయిడ్స్ అని పిల‌వ‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఏర్ప‌డే ఫ్రీ ర్యాడిక‌ల్స్ ప్ర‌భావాన్ని త‌గ్గిస్తాయి. దీని కార‌ణంగా క్యాన్స‌ర్లు రావు. మెుక్కజొన్నలో బీటా కెరోటిన్‌, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి ఉండ‌డం వ‌లన చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. జింక్‌, పాస్పర‌స్‌, మెగ్నిషియం, ఐర‌న్‌లు, ఇత‌ర మిన‌రల్స్ కూడా మొక్క‌జొన్న‌లో ఉన్నాయి. ఇవి ఎముక‌లను పటిష్టంగా ఉంచడానికి దోహదం చేస్తాయి. కీళ‌్లనొప్పులతో బాధప‌డేవారు మొక్క‌జొన్న‌ల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మొక్క‌జొన్న‌ల్లో పుష్క‌లంగా ఉన్న ఐరన్ వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య తగ్గుతుంది మొక్కజొన్నల్లో ఉండే అధిక పీచు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. మధుమేహం ఉన్నవారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌లన మొక్క జొన్న గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. మొక్క‌జొన్న‌ల‌ను గ‌ర్భిణీలు తినడం వల్ల పుట్ట‌బోయే పిల్ల‌ల‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రావు.

Related posts