telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

కొండపిలో టీడీపీ గెలుపు కోసం.. ఏకమైన తెలుగు తమ్ముళ్లు!

Kondampi constitution TDP campaign
ప్రకాశం జిల్లా కొండపి అసెంబ్లీలో నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావ అనంతరం రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే నాలుగు పర్యాయాలు టీడీపీ గెలుపొందగా, నాలుగు పర్యాయాలు కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. 1994లో మాజీ మంత్రి దివంగత దామచర్ల ఆంజనేయులు వచ్చిన తర్వాత టీడీపీ ప్రభావం పెరిగింది. 2004లో ప్రస్తుత కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో కొండపి ఎస్సీలకు రిజర్వయింది. వైసీపీ పోటీ చేసిన 2014 ఎన్నికల్లో ఆపార్టీ ఓటమి చెందిన ప్రస్తుత టీడీపీ అభ్యర్థి స్వామి గెలుపొందాడు. ఈ నియోజకవర్గంలో టీడీపీ అనుకూలంగా చెప్పుకుంటున్న కమ్మ సామాజిక వర్గీయుల రాజకీయ ఆధిపత్యం అధికం. ఆ సామాజికర్గ ఓట్లు సుమారు 43వేలు ఉన్నాయి.
ప్రస్తుతం కొండపి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ స్వామి రంగంలో ఉండగా, వైసీపీ అభ్యర్థిగా డాక్టర్‌ వెంకయ్య బరిలోకి దిగారు. కాంగ్రెస్‌తోపాటు బీఎస్పీ అభ్యర్థి కూడా రంగంలో ఉన్నారు. అయితే ఇద్దరు డాక్టర్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఇద్దరు డాక్టర్లు కూడా  ప్రభుత్వ వైద్య ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చినవారే కావడం గమనార్హం.  ఒకప్పుడు అటు దామచర్ల, ఇటు పోతుల వర్గీయులు బద్ధ శత్రువులుగా ఉండేవారు. సీఎం చంద్రబాబు పుణ్యమా అంటూ ఇద్దరూ సహచరులుగా మారారు. నియోజకవర్గాల పునర్విభజనలో టంగుటూరు మండలం కొండపి నియోజకవర్గంలో చేరడమే కొంతమేర కలిసివచ్చింది. స్థానిక విభేదాలను సీఎం సవరించడం ద్వారా కొండపి, జరుగుమల్లి మండలాల్లో టీడీపీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తున్నాయి. స్థానిక పరిస్థితులను సద్వినియోగం చేసుకొని కొండపి అసెంబ్లీలో భారీ ఆధిక్యం సాధించాలని  టీడీపీ  భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Related posts