జాన్వీ తన తండ్రి బోనీ కపూర్ ఏకంగా 12 కిలోల బరువు తగ్గాడంటూ ప్రచారం చేస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ఆయన అన్ని కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా, ట్రిమ్‌గా మారి నాకు స్పూర్తిగా నిలిచారని జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం స్లిమ్‌గా ఉన్న తన తండ్రి ఫోటోని షేర్ చేసి మరీ ఈ విషయాన్ని తెలిపింది జాన్వీ. ఇప్పుడు తన తండ్రిని చూస్తే గర్వంగా ఉందని జాన్వీ అంటుంది.
జాన్వీ కపూర్ ప్రస్తుతం శరణ్ శర్మ దర్శకత్వంలో పైలట్ గున్‌జాన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘కార్గిల్ గర్ల్ ఇన్ లక్నో’ చిత్రంతో పాటు కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తక్త్ చిత్రంతో బిజీగా ఉంది. ఇక అజిత్ ప్రధాన పాత్రలో బోనీ కపూర్ పింక్ రీమేక్‌గా నెర్కొండ పార్వాయి అనే చిత్రం చేస్తున్నారు. ఇందులో విద్యా బాలన్ కథానాయికగా నటిస్తుంది.