telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆఫర్స్‌ రావాలంటే ఇలా ఉండాల్సిందే…

Yash

హీరో యష్ కేజీఎఫ్ సినిమాతోనే యష్ పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకున్నాడు. కేవలం కన్నడ భాషకు మాత్రమే పరిమితం అయిన యష్ తన కెరీర్‌ అనుకొని విధంగా కేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఒక్క సినిమాతో ఈ రేంజ్ ఫాన్ ఫాలోయింగ్, క్రేజ్, స్టార్ డమ్ రావడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఇటీవల యష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో కేజీఎఫ్‌కు సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసుకున్నాడు. అంతేకాకుండా దేశంలో గోల్డ్ మైన్స్ గురించి కానీయండీ మరే ఇతర విషయాల గురించైనా మనకు తెలియని అనేక విషయాలు ఉన్నాయి. వీటన్నింటినీ మా సినిమాలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం. అంతేకాకుండా ఈ సినిమా మరో కొత్త కథగా అందరూ అనుభూతి చెందేలా కేజీఎఫ్2ను సిద్దం చేస్తున్నాం. వీటితో పాటుగా దక్షిణ హీరోల గురించి కూడా మాట్లాడాడు. దక్షిణ భారత హీరోలందరూ మల్టీటాలెంటెడ్ అయ్యుండాలి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ అంటే అనేక భాషల్లో సినిమాను రూపొందిచాలి. అందుకే వివిధ బాషలను మాట్లాడగలగాలి. అంతేకాకుండా ఫైట్స్, డాన్స్ ఇలా అనేక విషయాల్లో కూడా అల్లుకుపోయేలా ఉండాలి. ప్రతి దానికి సూట్ అయ్యేలా ఉండటం మినిమం క్వాలిటీస్ అని అన్నాడు. అంటే దాదాపు పాన్ ఇండియా స్టార్ కావాలంటే వివిధ భాషలు వచ్చుండాలని, ఫిట్‌గా ఉండాలని సలహా ఇచ్చాడు. ప్రస్తుతం యష్ చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై ఇతర హీరోలు ఎలా రియాక్ట్ అవుతారనేది హాట్ టాపిక్‌గా ఉంది.

Related posts