telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

20 రూపాయలతో.. ఇన్సూరెన్స్ : మోబిక్విక్

Mobikwik insurance offer to its customers

ప్రతి సంస్థ తన వినియోగదారుల కోసం ఎప్పుడు ఏదో ఒక సరికొత్త ఆఫర్ తీసుకొస్తూ, వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. తాజాగా డిజిటల్ పేమెంట్ సంస్థ మొబిక్విక్ కూడా తన యూజర్లకు ఇన్సూరెన్స్ సేవలను అందించనుంది. వినియోగదారులకు డిజిటల్ జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్) సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఇందుకుగాను యూజర్లు నెలకు రూ.20 ప్రీమియం చెల్లిస్తే లక్ష రూపాయల జీవిత భీమా కవరేజ్ పొందవచ్చు. కాగా మొబిక్విక్ గతేడాది నవంబరులో డిజిటల్ ప్రమాద బీమా సేవలు ప్రకటించింది. తాజాగా ఇప్పుడు డిజిటల్ ఇన్సూరెన్స్ విభాగంలో జీవిత బీమా సేవలను ఆవిష్కరించింది. మొత్తం మూడు పాలసీలు ఉన్నాయి ఇందులో.. నెలకు రూ.20 ప్రీమియం కడితే రూ.లక్ష, రూ.30 కడితే రూ.1.5 లక్షలు, రూ.40లు ప్రీమియం కట్టినట్లైతే రూ.2 లక్షల వరకు బీమా సౌకర్యం పొందవచ్చని మొబిక్విక్ తెలిపింది.

Related posts