telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసు స్టేషన్ లో ఉంచారు: వీహెచ్

hanmanth rao congress

దేశమంతా రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న రోజున అంబేద్కర్ విగ్రహం పోలీసు స్టేషన్ లో ఉంచారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో విగ్రహం పడివుండటం తనను కలచి వేసిందని అన్నారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చిన ఘనత తెలంగాణ సర్కారుకు మిగిలిందని ఎద్దేవా చేశారు.

ఫిబ్రవరి 1లోగా అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడి నుంచీ అయితే తెచ్చారో, ఆ చోటుకే చేర్చి ప్రతిష్ఠ చేయాలని లేకుంటే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. అంబేద్కర్ కు తీరని అవమానం జరిగినా, ఏ నాయకుడూ మాట్లాడటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహ ప్రతిష్ఠాపన కోసం తన ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

Related posts