ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ దూసుకుపోతుంది. ఈ రోజు మరో ఐదు కోవిడ్-19 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 82కు చేరింది. నేడు నమోదైన ఐదు కేసుల్లో బాధితులందరూ ఢిల్లీ మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన వారి బంధువులేనని కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు.
తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 386కి చేరింది. ఇప్పటి వరకు పది మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇంకా 365 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కర్నూలు తర్వాత 58 కేసులతో గుంటూరు రెండో స్థానంలో ఉంది.