ఇవాళ అంతర్జాతీయ యోగ దినోత్సవం. కర్ణాటకలోని మైసూరులో యోగా వేడుకల్లో దేశ ప్రధాని మోదీ పాల్గొన్నారు. మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్నవారితో కలిసి మోదీ యోగాసనలు వేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటుముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్రమంత్రి సోనోవాల్ తదితర ప్రముఖులతో పాటు సుమారు పదిహేను వేల మందికిపైగా ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ..ఈ 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
యోగా మనకు శాంతిని కలిగిస్తుందని, యోగా వల్ల కలిగే శాంతి వ్యక్తులకు మాత్రమే కాదు, దేశాలకు, ప్రపంచానికీ శాంతిని తెస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు
కొన్నేళ్ల క్రితం ఇళ్లు, ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదని, ప్రస్తుతం ప్రపంచ నలుమూలలా విస్తరించిందని అన్నారు.
మనం ఎంత ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఉన్నప్పటికీ.. కొన్ని నిమిషాల పాటు చేసే ధ్యానం మనల్ని రిలాక్స్ చేస్తుందని అన్నారు.
ఆరోగ్యవంతమైన శరీరానికి ఇది ఎంతో అవసరమని అన్నారు. ఈ రోజు యోగా ప్రతిధ్వని ప్రపంచం నలుమూలల నుండి వినిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఇది జీవితానికి ఆధారం అయిందని అన్నారు.
యోగా వల్ల అంతర్గత శాంతితో కోట్ల మంది ప్రజలు ప్రపంచ శాంతి వాతావరణాన్ని సృష్టిస్తారు. యోగా ‘జీవితంలో భాగం’ కాదు, ‘జీవన మార్గం’గా మారింది. మనం యోగాతో జీవించాలని, యోగాను కూడా తెలుసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. మైసూర్ వంటి భారతదేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలు శతాబ్దాలుగా పెంపొందించిన యోగా శక్తి నేడు ప్రపంచ ఆరోగ్యానికి దిశానిర్దేశం చేస్తోందని అన్నారు.
విశ్వ మానవాళి ఆరోగ్యమే లక్ష్యం.. ఇదే అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉద్దేశం. మనసు, శరీరం అదుపు చేసే శక్తి యోగాకు ఉంది సూర్యుడి కదలికలను అనుసరిస్తూ యోగాసనాలు వేయాలి. ప్రపంచవ్యాప్తంగా 25కోట్ల మంది.. ఈ దఫా వేడుకల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.
గులాబీ జెండా ఎగరడం ఖాయం: మంత్రి గంగుల