ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది, ఏపిలో ఈరోజు అర్థరాత్రి నుండే సమ్మె చేయనున్నారు. ఈమేరకు 15 రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసీలో వివిధ సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు కార్మికసంఘం ఇతర కార్మిక సంఘాలు కలసి జేయేసీగా ఏర్పడి సమ్మె చేయనున్నారు. జేఏసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా 12 రీజియన్లలో సమ్మెకు సన్నాహక కార్యక్రమాలు చేశారు.
రాష్ట్రంలోని 12 రీజియన్లలో అన్ని డిపోల ఎదుట నిరసన ఆందోళనలు చేసి, కార్మికులను సమ్మెకు సమాయత్త పరిచారు. టీడీపీ మినహా ఇతర రాజకీయ పార్టీల సహకారం కోరారు.