telugu navyamedia
Uncategorized ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం

YCP MLA Sunil suicide attack

పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అధిక డోసేజ్‌లో మత్తు ఇంజక్షన్ చేసుకోవడంతో పాటు మణికట్టు వద్ద కోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. జగన్ అన్నా ఈ నిందలు భరించలేక పోతున్నా.. చనిపోతున్నా అంటూ సెల్పీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కొద్దిసేపటికే సునీల్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

గత ఎన్నికల్లో పూతలపట్టు నుండి సునీల్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ దఫా సునీల్ కు టిక్కెట్టు దక్కదని ప్రచారం సాగుతోంది. నాలుగు రోజుల క్రితం లోటస్‌పాండ్‌కు వచ్చిన సునీల్ కు జగన్‌ నివాసంలోకి వెళ్లేందుకు అనుమతి లభించలేదు. దీంతో సునీల్ మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఆత్మహత్యాయత్నానికి ముందు సునీల్‌ ఓ సెల్ఫీ వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో దీనిని చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీఐ ఈదురుబాషా, ఎస్‌ఐ చంద్రమోహన్‌ హుటాహుటిన సిబ్బందితో చర్చీలో ఉన్న సునీల్‌ వద్దకు వెళ్లారు. అతడిని పరిశీలించగా సునీల్‌ ఎడమచేతి మణికట్టు వద్ద బ్యాండేజ్‌ కట్టి ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాన్ని సునీల్‌ భార్య అడ్డుకున్నారు. తాను డాక్టర్‌నని, వైద్యం చేసుకుంటానని బదులివ్వడంతో పోలీసులు వెనుదిరిగి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts