ఐపీఎల్ 2020 లో ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకోవడంతో హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా వచ్చిన డేవిడ్ వార్నర్, వృద్దిమాన్ సాహా రెచ్చిపోయారు. మొదటి నుండి దూకుడుగా ఆడిన వార్నర్ పవన్ ప్లే లోనే అర్ధశతకం పూర్తి చేసాడు. కానీ 34 బంతుల్లో 68 పరుగులు చేసిన వార్నర్ అశ్విన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మనీష్ పాండే కొంచెం నెమ్మదిగా ఆడుతుంటే సాహా విజృంభించాడు. కేవలం 45 బంతుల్లో 87 పరుగులు చేసి అన్రిచ్ నార్ట్జే బౌలింగ్ లో క్యాచ్ రుపంల్లో వెనుదిరిగాడు. ఇక వెంటనే అందుకున్న మనీష్ 31 బంతుల్లో 41 పరుగులు చేస్తే సాహా తర్వాత వచ్చిన విలియమ్సన్ 10 బంతుల్లో 11 పరుగులు చేసాడు. దాంతో హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే ఢిల్లీ 220 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ఢిల్లీ ప్లే ఆఫ్ లో బెర్త్ సంపాదించిన మెదటి జట్టుగా నిలుస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరి విజయం సాధిస్తారు అనేది.
previous post
next post
ఓట్ల కోసమే అలా చేస్తుంది.. ప్రియాంకపై స్మృతి ఇరానీ ఘాటు వ్యాఖ్యలు