telugu navyamedia
క్రీడలు వార్తలు

మైకేల్ వాన్ కు మానసిక మలబద్దకం…

న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ భారత్​లో పుట్టుంటే కోహ్లీని మించి, ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్​మన్​గా పేరు తెచ్చుకునేవాడంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలపై సల్మాన్ బట్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. వన్డేల్లో కనీసం ఒక్క సెంచరీ కూడా చేయని మైకేల్ వాన్‌కు కోహ్లీ గురించి మాట్లాడే అర్హత లేదన్నాడు. మైకేల్ ఇక సల్మాన్ బట్ వ్యాఖ్యలపై మైకేల్ వాన్ కూడా ఘాటుగా స్పందించాడు. సెంచరీ చేయకున్నా ఫిక్సింగ్ అయితే చేయలేదని, ఈ సోయి సల్మాన్ బట్‌కు అప్పడుంటే బాగుండేదని ట్విట్ చేశాడు. ‘బట్ నాపై చేసిన వ్యాఖ్యలు విన్నా. తన అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ అతడికుంది. అయితే 2010లో మ్యాచ్ ఫిక్సింగ్​ విషయంలో కూడా అతనికి ఇంతే స్పష్టత ఉంటే బాగుండేది’అన్నాడు. ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సల్మాన్ బట్.. మైకేల్ వాన్ మానసిక మలబద్దకంతో బాధపడుతున్నాడని ఘాటుగా విమర్శించాడు. అతను అసలు విషయాన్ని పక్కదారి పట్టించి మాట్లాడుతున్నాడని, మానసిక మలబద్దకంతో బాధపడే వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బట్ పేర్కొన్నాడు.

Related posts