telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆ టీచర్లను కోవిడ్ వారియర్లుగా గుర్తించాలన్న హైకోర్టు

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచన్ లు ఏర్పాటు చేసి లాక్ డౌన్ లో ఉచిత భోజనం కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేషన్ లు ఎన్ జీఓ లతో ఒప్పందం చేసుకుని కామ్యునిటి కిచన్ లు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలన్న హైకోర్టు.. ప్రతి జిల్లా వెబ్ సైట్ లో కమ్యూనిటీ కిచన్ వివరాలు ఉంచాలని తెలిపింది. అయితే 45 ఏళ్ల లోపు వారికి ఇంకా వ్యాక్సినేషన్ ప్రారంభం కాలేదన్న ఏజీ… వాక్సినేషన్ కు సంబందించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వం కు హైకోర్టు సూచించింది. సీనియర్ సిటిజన్ లు, పేద వారికి వాక్సినేషన్ కోసం ఎన్జివో లతో ఒప్పందం చేసుకుని డ్రైవ్ ఇన్ వాక్సినేషన్ పెట్టాలన్న హైకోర్టు… కోవిడ్ టెస్టులు పెంచండని చెప్పిన ప్రభుత్వం పెంచడం లేదని పేర్కొంది. 13 జిల్లాల్లో కేవలం 20వేళ టెస్టులు మాత్రమే చేశారన్న హైకోర్టు… రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ లో 3లక్షలు టెస్ట్ లు చేశారని తెలిపింది. ఎలక్షన్ డ్యూటీ లో ఉండి 500 మంది టేచర్లు కరోనా బారిన పడ్డారు 15 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారన్నారు పిటిషనర్లు. అయితే ఎలక్షన్ డ్యూటీ లో ఉండి కరోనా బారిన పడిన టీచర్లను కోవిడ్ వారియర్లు గా గుర్తించాలన్న హైకోర్టు… వారికి ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహకారం అందించాలని తెలిపింది.

Related posts