telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

“చినదానా!”

madhura smrutulu poetry corner
కలువ రేకుల కనులదానా!
చిలిపి చూపుల చినదానా!
విచ్చిన దానిమ్మ విత్తుల పలువరుసదానా
గులాబీ మొగ్గల బుగ్గల దానా!
చెంపకు చారెడు సిగ్గులదానా! 
కళ్ళల్లో దోసెడు కాంతులదానా!
పెదవుల్లో బారెడు మధువులదానా!
గుండెల్లో గుప్పెడుమనసున్నదానా!!
సుందర వదనా!వలపుల సదనా!
మదిలో కురిసిన వలపులవానా!
మీటిన పలికే ప్రేమవీణా!
నను లాలించు లలనా!
నా మనసు దోచిన 
నెమలి నడకల నెరజాణా!
నీహృదయ ప్రేమ సౌధంలో 
కాసింత చోటిస్తావా!
అందాల అధరాల సాక్ధిగా!
-గద్వాలసోమన్న, ఎమ్మిగనూరు

Related posts