telugu navyamedia
తెలంగాణ వార్తలు

రేవంత్‌రెడ్డి ఒక దొంగ‌..వైఎస్ ను కాంగ్రెస్ విస్మ‌రించింది..

లోటస్పాండ్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ మొదటి ఆవిర్భావోత్సవ‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో షర్మిల జెండా ఎగురవేసి…. వైస్సార్‌కు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం 1,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. సమస్యలను ఎత్తి చూపడానికే పాదయాత్ర చేపట్టానని తెలిపారు. పాదయాత్ర ద్వారా ఎందరినో కలుసుకున్నానని, సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు.

వైఎస్ను స్మరించుకోవడానికి హైదరాబాద్లో సెంటు భూమి కూడా లేదా? అని ప్రశ్నించారు. షర్మిల వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి గడపను… ప్రతి గుండెను తాకిందని చెప్పారు. వైఎస్సార్ సువర్ణ పాలనను ప్రజలు గుర్తించారని తెలిపారు. వైఎస్ సేవలను ప్రభుత్వాలు మాత్రం గుర్తించలేదని దుయ్యబట్టారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో గుండెల్లో నిలిచి ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని వైఎస్ రెండు సార్లు అధికారంలోకి తెచ్చారన్నారు. అలాంటి వైఎస్ కు కాంగ్రెస్ చేసిందేమిని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

వైఎస్ఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ గారి పేర్లు పెట్టారన్నారు.కానీ వైఎస్ ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు, మంత్రులు ఒక్క పథకానికైనా వైఎస్ఆర్ పేరు పెట్టారా? అని ఆమె అడిగారు.

కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కి వెన్నుపోటు పొడిచిందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందన్నారు. వైఎస్ఆర్ పేరు కోసం ప‌నిచేస్తామ‌ని రేవంత్ రెడ్డి చెబుతున్న దొంగ మాట‌లు న‌మ్మే వారు లేరని షర్మిల అభిప్రాయపడ్డారు. రేవంత్‌రెడ్డి ఒక దొంగ‌, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వాడని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు

కేసీఆర్ వైఎస్సార్‌కు తీర‌ని అన్యాయం చేశార‌ని , వైఎస్కు కేటాయించిన స్థలాన్ని సీఎం కేసీఆర్ వెనక్కు లాక్కున్నారు. రాజశేఖర్‌రెడ్డి చనిపోతే తెలంగాణలో 700 మంది చనిపోయారు.

టీఆర్ఎస్ భవన్ను ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి కాదా అని ప్ర‌శ్నించారు?.. వైఎస్సార్ గౌరవార్థం హైదరాబాద్లో స్థలం కేటాయించాలని కోరుతున్నామ‌ని అన్నారు. నెక్లేస్ రోడ్‌లో ఇస్తారో ఎక్క‌డ ఇస్తారో ..వైఎస్సార్‌కు స్థ‌లం కేటాయించాల‌ని డిమాండ్ చేశారు. 

ప్రస్తుతం టీఆర్ఎస్లోని సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్ను రాజకీయ నాయకులుగా చేసింది వైఎస్సార్ కాదా?.. వైఎస్సార్ను కాంగ్రెస్ అవమానించిన విషయం నిజం కాదా?.. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు కావాలని, వైఎస్సార్కు ఎలాంటి గౌరవం ఇవ్వలేదని అన్నారు.

Related posts