telugu navyamedia
రాజకీయ వార్తలు

మన దేశ జీడీపీ కన్నా బంగ్లాదేశ్ జీడీపీ అధికం: ఉండవల్లి

Undavalli Arun kumar

కేంద్ర ప్రభుత్వ విధానాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. కేవలం హిందుత్వ, పాకిస్థాన్‌ ఎజెండాతో కేంద్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దట్లేదని ఉండవల్లి ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అని ప్రశ్నించారు. మన దేశ జీడీపీ కన్నా బంగ్లాదేశ్ జీడీపీ అధికంగా ఉందని చెప్పారు. మనం సాయం చేసిన బంగ్లాదేశ్ ఇప్పుడు మనకన్న ఎక్కువ జీడీపీని సాధించిందన్నారు.

మన్మోహన్ ప్రధాని అయిన తర్వాత మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడిందని అన్నారు. ఆ తర్వాత మళ్లీ నాశనమైందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్థిక వ్యవస్థపై దృష్టిపెట్టాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని కేంద్ర ప్రభుత్వానికి మెయిల్ పంపానని తెలిపారు. తన మెయిల్‌ను వారు పట్టించుకుంటారో లేదోనని అన్నారు.

Related posts