telugu navyamedia
క్రీడలు వార్తలు

సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఏం చేయాలి…?

కరోనా కారణంగా యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ 2020 లో ముంబై టాప్ ఆర్డర్ బాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడిన యాదవ్ రెండు అర్ధ శతకాలతో కలిపి మొత్తం 281 పరుగులు సాధించాడు. అయితే ఈ ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళాల్సి ఉంది. ఇందుకోసం నిన్న బీసీసీఐ మూడు ఫార్మాట్లలో జట్లను ప్రకటించింది. ఇందులో ఏ జట్టులోను సూర్యకుమార్ యాదవ్ కు అవకాశం దక్కలేదు. అయితే ఈ జట్లను బీసీసీఐ ప్రకటించిన వెంటనే సూర్యకుమార్ పేరు ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యింది. అంటే చాలా మంచి అతనికి జట్టులో అవకాశం వస్తే బాగుటుంది అనుకున్నారు. ఈ జాబితాలో భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఉన్నాడు. తన ట్విట్టర్ లో హర్భజన్ ” సూర్య కుమార్ యాదవ్ భారత జట్టులోకి రావడానికి నిరూపించుకోవడానికి ఇంకేముందో తెలియదు. అతను ప్రతి ఐపీఎల్ సీజన్ మరియు రంజీ సీజన్ లలో అద్బుతంగా రాణిస్తున్నాడు.. అతని రికార్డులను చూడాలని నేను సెలెక్టర్లందరినీ అభ్యర్థిస్తున్నాను” అని తెలిపాడు.

Related posts