తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణికి పితృ వియోగం కలిగింది. ఘంటా చక్రపాణి తండ్రి మొగలయ్య(89) అనారోగ్యంతో మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో గతకొంతకాలంగా బాధపడుతున్న మొగలయ్య నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. మొగలయ్య మరణవార్త తెలిసిన మంత్రి జగదీష్ రెడ్డి నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. మొగలయ్య భౌతికకాయాన్ని వారి స్వస్థలం కరీంనగర్ జిల్లాకు తరలిస్తున్నారు.
వైఎస్ జగన్ పులివెందుల పులిబిడ్డ: సినీనటి రమ్యశ్రీ