telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఓటరు నమోదు, అభ్యంతరాలు, సవరణకు ఈ నెల 19వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి:జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమీషనర్ రోనాల్డ్ రోస్

రెండవ ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2023 కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు, అభ్యంతరాలు, సవరణకు ఈ నెల 19వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమీషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన నేపథ్యంలో ఓటరు జాబితాలో ముందు గా మీ పేరు ఉందో లేదో ఈసీఐ వెబ్ సైట్ https://voters.eci.gov.in/ ద్వారా గాని voter helpline app download చేసుకొని సరి చూసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాలో పేరు లేని పక్షంలో పైన తెలిపిన ఈసీఐ, వెబ్ సైట్ గానీ ఓటరు హెల్ప్ లైన్ ద్వారా తిరిగి నమోదు చేసుకోవాలన్నారు.

ఫారం-6
18 సంవత్సరాల వయస్సు దాటిన వారు, అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండబోయేవారు, ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవాలి.

ఫారం-6బి
ఓటరు జాబితాలో ఆధార్ ను అనుసంధానం/ అప్ డేట్

ఫారం-7
ముసాయిదా ఓటరు జాబితా పేరు తొలగింపు, అభ్యంతరాలు

ఫారం-8 (సవరణలు)
*ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లో తప్పులు.,
*ఇంటి నెంబర్ తప్పుగా ఉన్నప్పుడు.

*ప్రామాణికంగా లేని ఇంటి నెంబర్.

*అడ్రస్ మారినపుడు.

*ఓటరు జాబితాలో మిస్ మ్యాచ్ ఫోటోలు.

*సక్రమంగా లేని ఫోటోలు.,

*కుటుంబ సభ్యుల రిలేషన్ తప్పుగా నమోదైన చో (తల్లి, తండ్రి, భార్య, భర్త, కూతురు) .

*ఒకే కుటుంబ సభ్యులు అదే నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ స్టేషన్ లో ఉన్న చో.

*కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు నియోజకవర్గంలో నమోదు అయినచో.

*మొబైల్ నెంబర్ అప్ డేట్ .

ఇంకా తదితర తప్పులు సవరించుకోవడానికి ఈ నెల 19 లోపు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకొనగలరు.

ఓటరు జాబితాలో మీ ఓటరు సరి చూసుకొనుటకు, సవరణలు, కొత్త ఓటరు నమోదు, అభ్యంతరాల కొరకు మీ దగ్గరలో ఉన్న ఈఆర్ఓ, ఏ ఈ అర్ ఓ లు గా వ్యవహరిస్తున్న డిప్యూటీ కమిషనర్ లను సంప్రదించగలరు. లేదా ఈసీఐ వెబ్ సైట్ https://voters.eci.gov.in/ ద్వారా గాని voter helpline app download చేసుకొని తద్వారా నమోదు చేసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.

జిల్లా ఎన్నికల అధికారి
——————————————————————————————————–

– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.

Related posts