telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మహిళలకు గుడ్‌ న్యూస్‌ : భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

బులియన్‌ మార్కెట్‌లో గత నాలుగు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు ఇవాళ భారీగా పడిపోయాయి. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ లలో బంగారం ధర రూ. 400 మేర తగ్గింది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 తగ్గి రూ. 49,260 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గి రూ. 45,150 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గిపోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 450 తగ్గి రూ. 46,900 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గి రూ. 43,000 పలుకుతోంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా ఇవాళ భారీగా పడిపోయాయి. కిలో వెండి ధర మార్కెట్లో ఏకంగా రూ. 900 తగ్గింది. కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 73, 400 వద్ద ఉన్నది.

Related posts