telugu navyamedia
రాజకీయ వార్తలు

అనుమ‌తిస్తే ఆల‌యాలు ఓపెన్ చేస్తాం!

yadurappa karnataka

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా పలు రాష్ట్రల్లో ఆలయాలు మూతపడ్డ సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఆల‌యాలు తెరిచేందుకు ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యం కోసం వేచిచూస్తున్నామ‌ని క‌ర్నాట‌క సీఎం కార్యాల‌యం పేర్కొన్న‌ది. మే 31వ తేదీ త‌ర్వాత‌ రాష్ట్రంలో ఆల‌యాలు, మ‌సీదులు, చ‌ర్చిల‌ను ఓపెన్ చేయ‌నున్న‌ట్లు క‌ర్నాట‌క సీఎం ప్ర‌క‌టించారు. కానీ ఈ అంశంలో ప్ర‌ధాని నిర్ణ‌యం కోసం వేచిచూస్తున్న‌ట్లు ఇవాళ క‌ర్నాట‌క సీఎం కార్యాల‌యం పేర్కొన్న‌ది.

మార్చి 24వ తేదీన ప్ర‌ధాని ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో ఆల‌యాల‌న్నీ మూత‌ప‌డ్డాయి. అయితే జూన్ ఒక‌ట‌వ తేదీ నుంచి మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల‌ను ఓపెన్ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ప్ర‌ధాని మోదీకి క‌ర్నాట‌క ప్ర‌భుత్వం లేఖ రాసిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ అనుమ‌తి వ‌స్తే, ఒక‌ట‌వ తేదీ నుంచి ఆల‌యాల‌ను తెరుస్తామ‌ని సీఎం అన్నారు.

Related posts