సహజసిద్ధంగా ఏర్పడిన ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఏపీ సీఎస్ నీలం సాహ్ని అన్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఆటపాకలోని పక్షుల కేంద్రాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని విలేకరులతో మాట్లాడుతూ కొల్లేరును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.
వివిధ దేశాల నుంచి వేలకిలోమీటర్లు ప్రయాణించి కొల్లేరు తరలి రావడం ఈ ప్రాంత విశిష్టతకు నిదర్శనమని చెప్పారు. పర్యాటకంగా దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామని తెలిపారు. పక్షులను తిలకించేందుకు ఏర్పాటు చేసిన బోట్ సౌకర్యాలను పునరుద్ధరించేందుకు అటవీశాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించినట్టు తెలిపారు.