telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో కొత్త పార్టీ ఏర్పాటుపై బ్రదర్ అనిల్ హాట్ కామెంట్స్

*విశాఖలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో బ్రదర్‌ అనిల్‌ భేటీ
*విశాఖలో బ్ర‌ద‌ర్ అనిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
*న‌న్ను పార్టీ పెట్ట‌మ‌ని అన్ని సంఘాల వారు కోరుతున్నారు..

*పార్టీ పెట్ట‌డం అనేది అషామాషి వ్య‌వ‌హారం కాదు

*ఎవ‌రు సాయం లేకుండా ఎవ‌రూ రాజ‌కీయాల్లోకి రాలేరు..

ఏపీలో కొత్త పార్టీ పెట్టాలనే ఒత్తిడి తమపై  ఉందని.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని బ్రదర్ అనిల్ కుమార్ ప్రకటించారు.  సీఎం జగన్మోహన్ రెడ్డిని తాను కలిసి రెండున్నర సంవత్సరాలు గడిచాయని తెలిపారు.విశాఖలో మేఘాలయ హోటల్‌లో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో భేటీ అనంతరం బ్రదర్ అనిల్ కుమార్ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ విజయానికి ప్రధానకారణమైన వర్గాలకు న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఎన్నికల ముందు తనను నమ్మి వివిధ సంఘాలు వైసిపి ప్రభుత్వ ఏర్పాటు కృషి చేసారని….ఇప్పుడు వారు బాధలో ఉంటే స్పందించాల్సిన బాధ్యత తనకు వుందన్నారు. క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగింది… వాళ్ళు ఒక ప్రత్యామ్నాయా పార్టీ పెట్టాలి… బిసికి సీఎం పదవి ఇవ్వాలని అంటున్నారని… కానీ పార్టీ పెట్ట‌డం అనేది అషామాషి వ్య‌వ‌హారం కాదన్నారు.

వారి ఆవేదనను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు.  సీఎం జగన్‌ను   కలిసి రెండున్నరేళ్లు అయ్యిందని.. ఆయనను కలవాలంటే తనకు అపాయింట్‌మెంట్ అవసరమా అని ప్రశ్నించారు. ఎప్పుడు కావాలంటే అప్పులు వెళ్లగలనన్నారు. అయితే వైఎస్ఆర్‌సీపికి మద్దతుపలికిన వారి బాధలు, వెతలను ఓ లేఖ ద్వారా సీఎం జగన్‌కు తెలియచేస్తాననితెలిపారు.

ఇటీవల బీసీ సంఘాల ప్రతినిధులతో బ్రదర్ అనిల్ భేటీ అయ్యారు. పార్టీ పెడుతున్నారా అనే ప్రశ్నకు లేదు అని ఇటీవల సమాధానం ఇచ్చారు బ్రదర్ అనిల్. అయినా రాజకీయ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. 

ఈక్ర‌మంలో ఏపీలో కొత్త పార్టీ ఏర్పాటుపై బ్రదర్ అనిల్ సీరియస్ కామెంట్స్ చేశారు.ఏపీలో పార్టీ పెడితే ఏమైనా తప్పా అని ఎదురు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో తాను రాజకీయ పార్టీ పెట్టకూడదని ఎక్కడా రూల్ లేదన్నారు.

అయితే.. పార్టీ పెట్టాలన్న డిమాండ్ మాత్రం ఉందని దీనిపై ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటాన‌ని అన్నారు. ప్రస్తుతం తాను ఒక మార్గాన్ని ఎంచుకున్నానని.. అందులో నడుస్తున్నాను అంటూ చెబుతూ.. భవిష్యత్తులో పార్టీ పెట్టే అవకాశం ఉందనే సంకేతాలు కూడా ఇచ్చారు. తాజాగా పరిణమాలు చూస్తుంటే ఆమె పార్టీ పెట్టడం పక్కా అనే సంకేతాలే అందుతున్నాయి.

Related posts