telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పెన్షనర్లకు ఈనెల పూర్తి వేతనం.. ఏపీ సర్కార్ నిర్ణయం!

ap

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆదాయం తగ్గి, ఖర్చులు పెరగడంతో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రభుత్వాలు పొదుపు మార్గాలు పాటించక తప్పని పరిస్థితి నెలకొంది.

ఏపీ ప్రభుత్వం గత నెలకు సంబంధించిన వేతనాల్లో కోతలు విధించింది. అయితే ఈ నెలకు సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పట్లాగానే, కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి జీతాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మిగిలిన ఉద్యోగులకు గత నెలలాగే సగం జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది.

Related posts