telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు

మద్యం మత్తులో స్నేహితున్ని నరికిచంపిన యువకులు..

విశాఖపట్నం లో దారుణం జ‌రిగింది. మద్యంమత్తులో స్నేహితుల మధ్య మొదలైన చిన్న గొడవ చివరకు ఒకరి హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన విశాఖ మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ లో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే..

స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు వెళ్ళిన గాంధీ న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన రేపాక సాయితేజ మరో స్నేహితుడితో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే అందరూ కలిసి సాయితేజపై రాడ్లు, కత్తులతో వెంటాడి వెంటాడి దాడిచేయడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టు మార్టానికి త‌ర‌లించారు.. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిసి కెమెరా ఫుటేజి ఆదారంగా నిందితులను గుర్తిస్తున్నారు

Related posts